Listen to this article

ఎర్రావారిపాళెం జనవరి 29 జనం న్యూస్: చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని ఎర్రవారిపాలెం మండలంలో సుమారు 5 కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణ పనుల అభివృద్ధికి శ్రీకారం చుట్టడంతో చుట్టుపక్కల ఉన్న పల్లెలు మురిసిపోయాయి. బుధవారం ఎమ్మెల్యే పులివర్తి నాని ఎర్రవారిపాలెం క్రాస్ నుంచి రాయచోటి వరకు ఉన్న 21 కిలోమీటర్ల దూరం వరకు రోడ్డు నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ గతంలో రాయచోటి ప్రయాణ మార్గానికి వెళ్లే ప్రజలకు ఎర్ర వారిపాలెం నుండి రోడ్డు సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారని అన్నారు. నాడు ఇంటింటి ప్రచారంలో ప్రజలకు తాను ఇచ్చిన మాటను నెరవేర్చేలా నేడు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టానన్నారు. మారుమూల ప్రాంతాలు కూడా అభివృద్ధిని సాధించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. అభివృద్ధికి అహర్నిషులుగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే పులివర్తి నాని తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్న 40 గ్రామాల ప్రజలు:
5కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పులి వర్తి నాని 40 గ్రామాల ప్రజల సంతోష ఆనందాలకు కారణం గా మారారు.ఆర్ అండ్ బి రోడ్డు ప్రజల ప్రయాణానికి సౌకర్యవంతంగా ఉండడంతో పాటు వాణిజ్య, వ్యాపార సముదాయాలకు అనుకూలంగాను, మారుమూల గ్రామ ప్రజలకు రాజ మార్గంగాను నిలవడం తో ఎర్రవారిపాలెం మండల ప్రజలు ఎమ్మెల్యే పులివర్తి నాని పనితీరుపై హర్షాతి హర్షాలను వ్యక్తం చేశారు.
తలకోన ఆలయ అర్చకులు ప్రసన్నకుమార్ వేదమంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభ స్వాగతాలతో ఎమ్మెల్యే పులివర్తి నానికి కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు.