Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

బి ఆర్ యస్ పార్టీ తలపెట్టిన ఛలో బస్ భవన్ కార్యక్రమం లో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గ ఎస్ సీ విభాగ అధ్యక్షులు కూకట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొట్టు విష్ణు ని ముందస్తు అరెస్ట్ చేసిన కూకట్ పల్లి పోలీసులు. అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ టికెట్ల ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసిన కూకట్ పల్లి నియోజకవర్గ ఎస్ సీ విభాగ అధ్యక్షులు కూకట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొట్టు విష్ణు కాంగ్రెస్ మాటల్లో రాజ్యాంగ రక్షణ.. చేస్తున్నది రాజ్యాంగ భక్షణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న, పోరాడుతున్న ప్రతీ సారి బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు, అరెస్టులు చేయడం ఇదేనా ప్రజా స్వామ్యం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన అంటున్నారు ఇది ముమ్మాటికి పోలీసుల తోని రాజ్యం నడిపిస్తున్న రేవంత్ రెడ్డి కి రాబోయే రోజులు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు