Listen to this article

ఏర్గట్ల మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం తక్షణమే ప్రారంభించాలంటూ డిమాండ్

జనం న్యూస్ అక్టోబర్ 08:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల

మండలంలో బీజేపీ నేతలు, రైతులు కలిసి బుదవారం రోజునా తహసీల్దార్‌ కు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల కురిసిన అతి వర్షాల కారణంగా మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు ఆర్థికంగా దుస్థితికి గురయ్యారని వారు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికీ వరకు కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలనుప్రారంభించకపోవడంతో రైతులు దళారుల చేతుల్లో చిక్కుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్క క్వింటాలుకు రూపాయలు 400-500 వరకు నష్టపోతున్నారు.దీనివలన రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని పేర్కొన్నారు.“రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం నిజంగా రైతుల పక్షాన ఉంటే వెంటనే కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, హైవే దిగ్బంధం వంటి కార్యక్రమాలకు దిగుతాం” అని బీజేపీ నాయకులు హెచ్చరించారు.ఈ వినతి పత్రం సమర్పణ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏలేటి నారాయణ రెడ్డి, బూమేష్, రమేష్, మహిపాల్ రెడ్డి, రామరాజు, లింగారెడ్డి, వంశీ, రిషి తదితరులు పాల్గొన్నారు.