Listen to this article

జనం న్యూస్ శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం

అక్టోబర్ 10,ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా)

మన ఆలోచనలు, ఆచరణలూ అన్నీ మెదడుపైనే ఆధారపడి వుంటాయి. మెదడే గనుక లేకుంటే ఇంజన్‌ లేని రైలు, దారంలేని గాలిపటం అవుతాయి. మన కర్తవ్యాలను నెరవేర్చుకుంటూ, లక్ష్యాలను చేరి, ఆనందంగా జీవించేందుకు ఇతర శారీరక అవయవాలతోబాటు మానసిక ఆరోగ్యం సంతృప్తికరంగా వుండేలా చూసుకోవాలి. ఆ అవగాహన ఏర్పర్చుకోడానికి, అప్రమత్తంగా వంఉడటానికి, అవసరమైన ప్రణాళికలు రచించుకోడానికి, జాగ్రత్తలేంటో తెలుసుకుని పాటించడానికి ఉద్దేశించినదే ఈ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అని జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ పోగు అశోక్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి, ప్రజలను చైతన్యపరచడానికి మరియు మానసిక రుగ్మతలకు సంబంధించిన వివక్షను తగ్గించడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఈరోజున ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు చర్చలు జరపడం,సెమినార్లు నిర్వహించడం, మెంటల్‌ డిజార్డర్లేమీ చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మానసిక వైకల్యంతో బాధపడ్తున్నవారికి చికిత్స లాంటివన్నీ ఏర్పాటుచేస్తారు. మానసిక అనారోగ్యాన్ని అశ్రద్ధ చేసినా, చికిత్స మధ్యలో ఆపేసినా పరిస్థితి మరింత అదుపుతప్పే ప్రమాదం వుంది.శారీరక, మానసిక ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడివుంటాయి. దీర్ఘకాలిక శారీరక సమస్యలు కొన్నిసార్లు మెదడుపై ప్రభావం చూపుతాయి. అలాగే మానసిక దౌర్బల్యం శారీరకంగా క్షీణింపచేస్తుంది. కనుక అటు శారీరకంగాను, ఇటు మానసికంగానూ దృఢంగా వుండేట్లు చూసుకోవాలి. అప్రమత్తంగా వుండేందుకు అవస రమైన అంశాలను తెలుసుకోవాలి. 150 దేశాల మానసిక ఆరోగ్య కేంద్రాల సభ్యుల సలహా, సహకారాలతో 1992లో తొలిసారి వరల్డ్‌ పెడరేషన్‌ ఫర్‌ మెంటల్‌ హెల్త్‌ ప్రోద్బలంతో ఈ దినాన్ని జరుపుకోవడం మొదలుపెట్టారు.వైద్య పరిభాషలో డిప్రెషన్‌, యాంగ్జయిటీ, యాంగ్జయిటీ న్యూరోసిస్‌, బైపోలార్‌ డిజార్డర్‌, సోషల్‌ యాంగ్జయిటీ డిజార్డర్‌, పానిక్‌ డిజార్డర్‌, అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌, పోస్ట్‌ ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌, ఫోబియా, మానియా, స్కిజోఫ్రీనియా, డిల్యూషనల్‌ డిజార్డర్‌, స్లీప్‌ డిజార్డర్‌ (ఇన్‌సోమ్నియా), ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌, సుపీరియారిటీ కాంప్లెక్స్‌, ఇల్యూషన్‌, అడిక్షన్‌ లాంటి మానసిక వైకల్యాలు అనేకం ఉన్నాయి. స్థూలంగా చెప్పాలంటే మానసిక ఉద్రేకాలను నిగ్రహించు కోలేకపోవడమే రుగ్మతను తెచ్చిపెడ్తుంది. కష్ట సమయా లు, క్లిష్ట పరిస్థితుల్లో కుంగిపోకుండా బ్యాలెన్స్‌డ్‌గా వుండగల్గితే మెదడు సక్రమంగా పనిచేస్తుంది. కనుక వత్తిడికి గురికాకుండా సమస్య పరిష్కార దిశగా ఆలోచిస్తే మానసిక ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తున్నారు సైకాలజిస్టు పోగు అశోక్.ఆందోళన, వత్తిడి అనేవి డిప్రెషన్‌కు దారితీస్తాయి కనుక ముందుగా వాటికి చెక్‌పెట్టమని హితవు చెప్తున్నారు. కలతపరిచే ఆలోచనలు, చేటుచేసే చేష్టలు మానుకుంటే మానసిక రుగ్మతలేవీ దరిచేరవు అంటున్నారు సైకాలజిస్టు పోగు అశోక్.తగుమోతాదులో పౌష్టికాహారం, రోజులో కనీసం గంట సేపు వ్యాయామం, శక్తికి మించిన అలసట, దుర్భరమైన నొప్పి లేకుండా చూసుకోవడం, రిలాక్సేషన్‌ ఎక్సర్‌సైజులు, తీవ్ర ఉద్రేకాలకు లోనుకాకుండా, కుంగిపోకుండా వుండాలి. లోకంలో పరిష్కారం లేని సమస్యంటూ గుర్తించి, ప్రయత్నిస్తే ఆందోళనే వుండదు ఈపాటి జాగ్రత్తలు పాటించినట్లయితే మానసిక రుగ్మతలు దరిచేరవని హామీ ఇస్తున్నారు.