ఐసిడిఎస్ తడ్కల్ క్లస్టర్ సూపర్వైజర్ సుజాత
జనం న్యూస్,అక్టోబర్ 10,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామ సచివాలయంలో శుక్రవారం పోషణ మాసం,కార్యక్రమాని ఐసిడిఎస్ సూపర్వైజర్ రాథోడ్ సుజాత,క్లస్టర్ పరిధిలోని అంగన్వాడి టీచర్లతో కలిసి దీపారాధనతో ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్లలో నిర్వహిస్తున్న 1000, రోజుల ప్రాముఖ్యతను క్షుణ్ణంగా వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వర ఉత్సవాల్లో భాగంగా పోషణ మాసం సంవత్సరంలో రెండు సార్లు జరుపుకోవడం జరుగుతుందని అన్నారు.తల్లిపాల వరోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. చిన్నారుల తల్లులను తల్లిపాల విశిష్టతను తెలియపరచాలని అన్నారు.ప్రతి తల్లి తమ పిల్లలకు డబ్బాపాలు తాపకుండా తమ పిల్లలు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలంటే,కచ్చితంగా తల్లిపాలని తాపాలని సూచించారు.తల్లిపాలు తాపడం వలన చిన్నారులు శారీరక దృఢత్వంతో పాటు, ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందని అన్నారు.గర్భిణీలు గర్భం దాల్చిన నుంచి తూచా తప్పకుండా పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల తమ ఆరోగ్యంతో పాటు,తమ గర్భంలో పెరుగుతున్న శిష్పు ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు చీర సారే, పండ్లు పూలు,పసుపు కుంకుమలతో,సీమంతం నిర్వహించారు. బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు విటాబాయి,ప్రేమల, సువర్ణ,రాధా,స్వరూప, లలిత,బాలింతలు, గర్భిణీలు,చిన్నారులు, పాల్గొన్నారు.


