జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 10 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
గిరిజన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ఇవ్వడం పై హర్ష వ్యక్తం.
గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలి. ప్రభుత్వం నడపడం వలన విద్యార్థులకు తగిన న్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీను నాయక్ అన్నారు.శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేయవద్దని ఇప్పటికే సిపిఐ నుంచి తీవ్రంగా వ్యతిరేకించడం జరిగిందన్నారు. మును.. ముందు దీనిపై కార్యక్రమాలు చేపడతామన్నారు. మన్యం జిల్లా కురుపాం లో గిరిజన పాఠశాలలో చదువుతున్న ఇద్దరు బాలికలు పచ్చకామెర్లతో కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షలు చొప్పున మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం పట్ల హర్ష వ్యక్తం తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆ బాలికల కుటుంబాలకు ఎటువంటి పరిహారం ప్రకటించకపోవడం పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకులాల్లో, వసతి గృహాల్లో ఆర్వో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట సిపిఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు, అఖిల భారత యువజన సమితి (ఏఐవైఎఫ్) పట్టణ కన్వీనర్ బి. రాంబాబు నాయక్ పాల్గొన్నారు.


