జనం న్యూస్,అక్టోబర్ 10,అచ్యుతాపురం:
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో మరో చారిత్రక మైలురాయిని అధిగమించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి, ముఖ్యమంత్రిగా నేటితో (అక్టోబరు 10)15 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేతల జాబితాలో దక్షిణాది నుంచి ఈ ఘనత సాధించిన మూడో వ్యక్తిగా ఆయన నిలిచారు.ఈ సందర్భంగా యలమంచిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎలమంచిలి నియోజక వర్గ టీడీపీ ఇంచార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ బీమరశెట్టి శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు పెంటకోట విజయ్, శ్రీకాళహస్తి బోర్డు డైరెక్టర్ బీలా స్రవంతి, అచ్యుతాపురం మండల ప్రధాన కార్యదర్శి కాండ్రేగుల అప్పారావు,పోనమల్ల కొండబాబు, మద్దాల కృష్ణ,క్లస్టర్ ఇంచార్జ్ కాండ్రేగుల శంకర్,రేబాక మాలతి, దాడి శివ , ఆడారి జగన్నాధ రావు,సూరిశెట్టి అప్పలనాయుడు, తెలుగు అధ్యక్షులు మోహన్, బుజ్జి, బీల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.



