హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర హోటల్ వద్ద ఆడుకుంటూ వచ్చి తప్పిపోయి బాలుడు ఏడుస్తూ స్థానికులకు కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బాలుడిని హయత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజుగౌడ్ చేరదీసి ఈ విషయాన్ని అన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో తల్లిదండ్రులు బాలుడి ఆచూకీ తెలుసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. తమ కుమారుడినీ క్షేమంగా పోలీసులు అప్పగించడంతో తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేవు. వారి కళ్ళల్లో కన్నీటితోపాటు ఆనంద భాష్పాలు వెళ్లి విరిసాయి. హయత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ గౌడ్ తీసుకున్న చొరపై సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు..


