Listen to this article

జనం న్యూస్ 30 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో నమోదైన చీటింగ్ కేసులో నిందితుడికి ఆరు మాసాల జైలు శిక్ష, రూ.8000/- జరిమానా విధిస్తూ, AJFCM కోర్టు వారు తీర్పు వెల్లడించినట్లుగా వన్టౌన్ సీఐ ఎస్ శ్రీనివాస్ తెలిపారు. గజపతినగరం మండలం పురిటిపెంటకు చెందిన చలుమూరి వెంకట భాస్కరరావు అనే నిందితుడు ఐటీ మోసానికి పాల్పడంతో అప్పటి వన్ టౌన్ సీఐ డి లక్ష్మణరావు అతనిపై కేసు నమోదు చేసి తే. 31-05-2019 దిన రిమాండ్ కు తరలించి, అతనిపై కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. వన్ టౌన్ పోలీసులు ఈ కేసులో ప్రాసిక్యూషన్ సమయంలో సాక్ష్యాలను ప్రవేశపెట్టడంతో నిందితుడుకి ఆరు మాసాలు జైలు శిక్ష, రూ.8000/- జరిమాన విధిస్తూ Spl JFCM కోర్టు మెజిస్ట్రేట్ కుమారి పి.బుజ్జి తీర్పు వెల్లడించినట్లుగా వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్ తెలిపారు.