Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

కాట్రేనికోన మండలం గెద్దనాపల్లి గెద్దనాపల్లి గ్రామంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం జరిగింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశ రక్షణ కోసం సైనికుల్లా ముందుంటారని, దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం ప్రణంగా పెట్టి ముందుకు వెళ్తారని ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రతాప్ రాజ్ ప్రశంసించారు. మరో విశిష్ట అతిథి గ్రంధి నానాజీ మాట్లాడుతూ వ్యక్తి నిర్మాణం ద్వారా, దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం అని అన్నారు. కార్యక్రమమునకు వక్తగా వచ్చిన దత్తాత్రేయ వర్మ 1925లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్, 2025 విజయదశమి కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందని,ఆర్ఎస్ఎస్ సమాజాన్ని సంఘటిత పరచి, సమాజంలో చైతన్యాన్ని తీసుకువచ్చి ప్రతి వ్యక్తిలో దేశభక్తి భావనను నింపి తద్వారా ఈ దేశాన్ని ‘విశ్వ గురువు’గా నిలబెట్టడానికి మనమందరం మనవంతు కృషిని సల్పుతూ కలసి పనిచేద్దాం అన్నారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొలకోటి వెంకటరెడ్డి ఖండ కార్యవాహ నంద్యాల నరసింహమూర్తి సహ కార్యవాహ పొత్తూరి సత్యనారాయణ రాజు పట్ట మట్ట అఖిల్ కుడుపూడి దుర్గాప్రసాద్ గ్రామస్తులు మాతృమూర్తులు పాల్గొన్నారు