

జనం న్యూస్ అక్టోబర్ 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారాం పేద మధ్యతరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్ గా ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ ని తగ్గించి ప్రతి కుటుంబానికి 15 వేలు నుండి 25 వేలు వరకు ఆదా వచ్చే విధంగా పన్నులు గతంలో కంటే తగ్గించడం వల్ల ప్రతి కుటుంబానికి ప్రయోజనం కలుగుతుందని మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు జీఎస్టీ పై అవగాహన కలిగించడానికి 81 వ వార్డు నీలకంఠరావు వీధిలో పార్లమెంట్ కార్యదర్శి మల్ల గణేష్ ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళలకు జీఎస్టీ ప్రయోజనాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ వివరాలను ప్రజలకు వివరించే బాధ్యతను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకు వివరించాలని ఆదేశించారని, ప్రతి కుటుంబానికి ఇంటింటికి తిరిగి గతంలో జిఎస్టి 18 శాతం ఉన్న దాని నుండి 5 శాతానికి తీసుకురావడం వల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు జీఎస్టీ 2.0 తో ఉపశమనం కలుగుతుందని ప్రజలకు వివరించి మహిళలను ధరలు తగ్గిన విషయంపై ప్రశ్నించామని దానిపై ధరలు తగ్గిన విషయం మహిళల్లో స్పందన కనబడిందని నాగ జగదీష్ అన్నారు. శ్రీ భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ మాట్లాడుతూ నిత్యవసరాలు, మందులు, ఆరోగ్య భీమా, రెడీమేడ్ వస్త్రాలు, వినోదం, ఆటోమొబైల్, రవాణా తదితర అన్ని రంగాల్లో జీఎస్టీ తగ్గించడం వల్ల ప్రతి కుటుంబానికి ఏడాదికి 25 వేల నుండి 40,000 వరకు తగ్గే అవకాశం ఉంటుందని, అలాగే నిత్యవసర ధరలలో పాలు, పాల పదార్థాలు, నెయ్యి, నూనెలు, సబ్బులు, షాంపూలు, డిటర్టెంట్లు తదితరులపై గతంలో 12 శాతం నుండి 18 శాతానికి ఉండేదని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 5 శాతానికి తీసుకురావడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగిందని సత్యనారాయణ అన్నారు. మల్ల గణేష్ మాట్లాడుతూ నేడు ప్రతి కుటుంబంలో ద్విచక్ర వాహనం తప్పనిసరిగా వాడుతున్నారని ఈ వాహనం వినియోగంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వాడడం వల్ల జీఎస్టీ 28% ఉండే దానిని 18 శాతానికి తీసుకువచ్చారని, అలాగే టీవీ లేని ఇల్లులు ఉండవని, కొత్త కొత్త మోడల్స్ వచ్చినప్పుడు పాతవి అమ్మి కొత్తవి కొనడం వల్ల నేటి జీఎస్టీ తగ్గడం వల్ల 32 అంగుళాల టీవీ పై 4,500 తగ్గుదల ఉంటుందని, రాష్ట్రానికి ఆదాయం తగ్గినప్పటికీ జీఎస్టీ వల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం చేయడం కోసమే జీఎస్టీ అమలకు కేంద్రంకి సహకరించారని గణేష్ అన్నారు. మహిళా నాయకురాలు బీసెట్టి సన్నమడు మాట్లాడుతూ జీఎస్టీ తగ్గడం వల్ల నిత్యవసర వస్తువుల ధరలు తగ్గుదలను గమనించామని, అలాగే ఇతర వస్తువుల విషయంలో కూడా మహిళల్లో చర్చ జరుగుతుందని ప్రధాని మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీలా రమణారావు మల్ల రామకృష్ణ వీపు రాజు మల్ల మోహన్ మల్ల జగదీష్ కాండ్రేగుల కుమారి ఎల్లపు హేమ ఆళ్ల శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉదయం నుండి వర్షం పడినప్పటికీ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం విశేషం.//