Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 13 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

కల్తీ మద్యం కి వ్యతిరేకంగా మాజీ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో చిలకలూరిపేట ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కార్యాలయం వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.అనంతరం స్థానిక ఎక్సైజ్‌ అధికారులకు వినతిపత్రం అందజేశారు. నారా వారి సారా వద్దు , నకిలీ మద్యం తో ప్రజల ప్రాణాలు తీయవద్దు అంటూ నినాదాలతో కార్యక్రమం సాగింది.మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ నకిలీ మద్యం తయారీ, సరఫరాపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరారు.నకిలీ, కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించి, వారి కుటుంబాలను ఆదుకునేలా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.