

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
రాజంపేట నియోజకవర్గ ప్రజలు మరియు భక్తుల అవసరాలపరంగా గతంలో పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం రాజంపేట నుండి పెంచలకోనకు వెళ్లి వచ్చుటకు రాజంపేట బస్ డిపో నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేది, ప్రస్తుతం RTC బస్సును రద్దు చేయటం వలన ప్రజలకు అసౌకర్యంగా ఉన్న విషయాన్ని తెలియజేస్తూ నందలూరు వాకర్స్ క్లబ్ సభ్యులు ఇవాళ రాజంపేట అసెంబ్లీ ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ని వారి కార్యాలయము నందు కలిసి వినతి పత్రాన్ని సమర్పిం చడం జరిగింది.ఈ సంద ర్భంగా పెంచలకోనకు బస్సు సర్వీసు రద్దు చేయడం వల్ల ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం లో భాగంగా ఇటీవల ఆలయాలకు దర్శనార్థం వెళ్ళుటకు విపరీతమైన రద్దీ కూడా ఉన్నది ఈ కారణంగా రాజంపేట ప్రజలకు పెనుసుల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వెళ్లి వచ్చుటకు గాను రాజంపేట పరిసర ప్రాంతాల ప్రజల అవసరాల నిమిత్తం బస్సు సర్వీసు పునరుద్ధరించ వలసిందిగా తెలియ జేయడమైనది.ఈ విషయంపై చమర్తి జగన్ మోహన్ రాజు( రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ ) వాకర్స్ ప్రతినిధులు వినతి పత్రంపై స్పందించి RTC అధికారులతో మాట్లాడి ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకొని పెంచలకోనకు రాజంపేట నుండి RTC బస్సు సర్వీసు ను తిరిగి పునరుద్ధరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ క్యాబినెట్ డైరెక్టర్ మన్నెం రామ మోహన్,వాకర్ ఉప్పు శెట్టి సుధీర్, మోడ పోతుల రాము,గంధం గంగాధర్, గండికోట కృష్ణ కుమార్, తీగల కుంట వెంకటేష్, దాసరి వెంకటరమణ ( బీజేపీ మండల వైస్ ప్రెసి డెంట్ )తదితరులు కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది.