Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 13 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

ఎంపిడిఓ కె.శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ పి.శ్రీ హరి బాబులకు వినతి.

గిరిజన సమాఖ్య,యువజన సమాఖ్య నాయకులు.

చిలకలూరిపేట /మండలంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో త్రాగునీటి అవసరాలు తీర్చాల్సిన కొన్ని ఆర్వో వాటర్ ప్లాంట్లు ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నాయని గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీను నాయక్ అన్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వాటర్ ప్లాంట్ల పైన తగిన చర్యలు తీసుకోవాలన్నారు.సోమవారం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఎంపిడిఓ కె.శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ పి.శ్రీహరిబాబు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిలో మోతాదుకు మించి కెమికల్స్ వేయడం వలన ఎముకల్లో పటుత్వం తగ్గిపోయి ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇటీవల కాలంలో విజయవాడ ప్రాంతంలో ప్రధానంగా డయోరియాకు కారణం,ఆర్వో వాటర్ ప్లాంట్లు, శుచి, శుభ్రత లేకపోవడం వలన ప్రమాదకరమైన ఈ-కోలి లాంటి బ్యాక్టీరియాలు కలుస్తున్నాయని న్యాయనిపుణులు సూచిస్తున్నారు. అదే విధంగా లాభార్జన కోసం వాటర్ ప్లాంట్లు విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నారు. తక్షణమే ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నియంత్రణ, నీటిలో ప్రమాణాలు పాటించని ఆర్వో వాటర్ ప్లాంట్లుపై తగిన చర్యలు తీసుకో వాలని గిరిజన సమాఖ్య నుండి డిమాండు చేశారు. కొన్ని వాటర్ ప్లాంట్లుపైన రాజకీయ నేతల సిఫార్సులు లాంటివి చేసిన అధికారులు వాటర్ ప్లాంట్లుపై చర్యలు తీసుకోవాలని గిరిజన సమాఖ్య నుండి కోరుతున్నామని తెలిపారు.
అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) పట్టణ కన్వీనర్ బి. రాంబాబు నాయక్ పాల్గొన్నారు.