

జనం న్యూస్ అక్టోబర్ 13(నడిగూడెం)
మండలంలోని పలు గ్రామాల బీటీ రోడ్లను పిచ్చి మొక్కలు పూర్తిగా కమ్మేశాయి.దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు వాపోతున్నారు. తక్షణమే స్పందించి, రోడ్డుకు ఇరువైపులా పెరిగిన మొక్కలను తొలగించాలని కోరారు.