

కలెక్టర్లకు శిక్షణ ఇచ్చేందుకు ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్ర్తినేషనల్ అకాడమీ నుంచి ఆహ్వానం….
జనం న్యూస్ 15 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
జిల్లా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్దికి ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 27, 28వ తేదీల్లో ముస్సోరిలో జిల్లా కలెక్టర్ల కోసం నిర్వహించే రెండు రోజుల శిక్షణ ,వర్క్ షాపుకు రావాలని ప్రభాకరరెడ్డిని ఆహ్వానించింది. జిల్లా కలెక్టర్లకు 27న నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో పాల్గొని రెవిన్యూ ఎక్స్పర్ట్ (భూ సమస్యల దేశ స్థాయి నిపుణులు) శిక్షణ ఇవ్వాలని బి ఎన్ యుగంధర్ సెంటర్ ఫర్ రూరల్ స్టడీస్ డైరెక్టర్ కోరారు. రెవెన్యూ, సర్వే , భూ రికార్డుల వంటి భూ పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన విషయాలపై దేశంలోనే అత్యంత అనుభవం, మంచి పరిజ్ఞానం కలిగిన అధికారిగా కలెక్టరుకు మంచి పేరు ఉండటంతో ఆయన్ని ఈ మేరకు ఆహ్వానించింది.