Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 15 సంగారెడ్డి జిల్లా

గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి కమాన్ వద్ద వివేకానంద స్వచ్చంద సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూరక్తదానం మహాదానం అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చిమ్ముల గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.మన రక్తం మరో ప్రాణాన్ని కాపాడగలదనే భావనతో రక్తదానం చేయడం ప్రతి మనిషి కర్తవ్యమని ఆయన అన్నారు.
సేవ భావనతో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్న వివేకానంద స్వచ్ఛంద సేవా సమితి సభ్యులను అభినందించారు.