జుక్కల్ అక్టోబర్ 15 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం దోసపల్లి గ్రామం లో శ్రీ స్వామి నరేంద్ర చార్య జీ సంప్రదాయ్ పాండురంగ పటేల్ ప్రవాచకర్ సతీమణి అనారోగ్యం తో గత వారం రోజుల క్రితం మరణించడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే దోసపల్లి గ్రామానికి వెళ్లి పాండురంగ పటేల్ వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే తో పాటు జుక్కల్ మాజీ ఎంపీపీ యశోద నీలు పటేల్, సీనియర్ నాయకులు బొల్లి గంగాధర్, వాస రమేష్ పటేల్, విట్టు పటేల్, కాశినాథ్, స్వామి సంప్రదాయకులు నరేష్ సెట్ తదితరులు పాల్గొన్నారు.



