

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు అక్టోబర్ 15 : రాష్ట్రము లో వైద్యాధికారులు చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్త సమ్మెకు మద్దతుగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది మొత్తం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ బుధవారం విధులకు హాజరయ్యారు. విధుల నిర్వహణ సమయం లో ప్రతిరోజు నల్లబాడ్జిలతో వైద్యాధికారుల డిమాండ్లు నెరవేరే వరకు ఇలాగే విధులు కొనసాగిస్తామని సిబ్బంది మొత్తం ముక్త కంఠం తో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ వెంకటనారాయణ, ఎమ్ ఎల్ హెచ్ పీ లు, ఏఎన్ఎంలు, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.