Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 15 నడిగూడెం

ఉపాధి కూలీలకు వంద రోజుల పని దినాలను కలిపించేందుకు ప్రణాళిక బద్ధంగా గ్రామాలలో పనులను గుర్తించాలని ఎంపీడీవో మల్సూర్ నాయక్ తెలిపారు.బుధవారం నడిగూడెం మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గ్రామాల్లో చేపట్టే ఉపాధి పనులపై గ్రామ సభ నిర్వహించారు. నడిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి ఎలక ఉమారాణి అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో ఎంపీడీవో పాల్గొని మాట్లాడారు.గ్రామ సభలో టి ఏ అంజిరెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ పద్మ, నాయకులు దున్నా శ్రీనివాస్,దున్నా లింగయ్య, మిడిసిన మెట్ల శేఖర్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు,ఉపాధి కూలీలు పాల్గొన్నారు.