Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 15

తర్లుపాడు మండలంలోని జగన్నాధపురం గ్రామంలో గల మండల ప్రాథమిక పాఠశాలలో మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం జయంతి వేడుకలుపాఠశాలప్రధానోపాధ్యాయుడు కసెట్టి వెంకట జగన్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యా శాఖ అధికారినిదేవరకొండ సుజాతహాజరయ్యారు.ముందుగా అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలువేసిఘనంగానివాళులర్పించారు.ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారిని సుజాత, ప్రధానోపాధ్యాయుడు వెంకట జగన్ బాబులుకలిసిసంయుక్తంగా మాట్లాడుతూ అబ్దుల్ కలాం భారతదేశానికి11వరాష్ట్రపతిగాపనిచేశారన్నారు. ఈయన అసలు పేరు ఆవులపకీర్ జైనలుబ్ధి న్ కలాం, ఈయన అక్టోబర్ 15,1931వ సంవత్సరంలోతమిళనాడురాష్ట్రంలోని, రామేశ్వరంలో ఒకసామాన్య కుటుంబానికి చెందిన జలాల్, ఆశియా దంపతులకు జన్మించి, రామేశ్వరంలోనే ప్రాథమిక విద్య పూర్తిచేశాడన్నారు .ఈయనఉన్నతచదువులకోసంతిరుచురాపల్లిలోని సెయింట్ జోసెప్ కళాశాలలో భౌతిక శాస్త్రాన్ని అభ్యసించి, అనంతరం చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ఆఫ్టెక్నాలజీ కళాశాలలో ఏరోసిస్ ఇంజనీరింగ్ లో పట్టా పొంద్యాడన్నారు.భారత రాష్ట్రపతికాకముందురక్షణపరిశోధన సంస్థ లో ఏరోసిస్ఇంజనీరింగ్ గాపనిచేశాడన్నారు.ఈక్రమంలో ఆయనభారతదేశపు మిస్సైల్ మెన్ గా పేరుపొందాడున్నారు. ఈయనముఖ్యంగాబాలిస్టిక్ క్షిపణి ప్రయోగ వాహనసాంకేతికత అభివృద్ధికిమిగులకృషిచేశాడన్నారు. 1998లో భారత దేశ పోక్రాన్ టుఅనుపరీక్షలోకీలకమైనసాంకేతికతతో పాటు రాజకీయ పాత్రను కూడాపోషించాడన్నారు.అంతేకాక 1960లో కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లో శాస్త్రవేత్తగా చేరా డ న్నారు. అబ్దుల్ కలాం భారత దేశ సైన్యం కోసం ఒక హెలికాప్టర్ ను కూడా తయారు చేశారన్నారు. 1969లో భారతఅంతరిక్షపరిశోధనసంస్థలో చేరి ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహప్రయోగవాహనంతయారీలోపనిచేశాడన్నారు.1980సంవత్సరంలో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్షలో విజయవంతం చేసిందన్నారు. 1992నుండి1999వరకుప్రధానమంత్రి కిశాస్త్రీయసలహాదారుడిగా, డి ఆర్ డి ఓ ముఖ్య కార్యదర్శిగా పనిచేశాడ న్నారు. అబ్దుల్ కలాం 2002 నుండి 2007 వరకు వరకు భారత రాష్ట్రపతిగా ప్రజలకు తన అద్భుతమైనసేవలనుఅందించాడన్నారు.భారతరత్నఅవార్డుపొందిన వారిలో ఈయన మూడో వ్యక్తి అన్నారు.ఈయన2015లోషిల్లాంగ్ లోని ఐ ఐ ఎంఓలోనివిద్యార్థుల నుఉద్దేశించిప్రసంగిస్తూహఠాత్తుగా కుప్పకూలి పడిపోవడం జరిగింది. ఈసంఘటనజరిగిన45 నిమిషాలకేఆయనమృతిచెందడంజరిగిందన్నారు.కలాం జీవితచరిత్రగురించి, ఆయనదేశానికిచేసినసేవలుగురించి నేటి బాలలే రేపటి పౌరు లుగా పరిణతి చెందుతున్నవిద్యార్థులకు వివరించడంజరిగింది.ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని అనూష మరియు విద్యార్థులు పాల్గొన్నారు.