Listen to this article

జనంన్యూస్. 30. నిజామాబాదు. ప్రతినిధి:- నిజామాబాద్ నగరంలో నేడు బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి ప్రభుత్వ వైఫల్యాలను జనాలముందు ఉంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఊరికే కాలయాపన చేస్తుందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తెలిపారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం నగరంలోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం మహాత్మా గాంధీకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈరోజుకి 420 రోజులు పూర్తి అయిందని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 420 హామీలను ఇప్పటికైనా నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నీతు కిరణ్.మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి. బి ఆర్ ఎస్ నగర అధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.