Listen to this article


గుడిపల్లి గ్రామంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ప్రతి గ్రామం,ప్రతి పెదకుటుంబo అబివృద్ధి చెందాలని మార్నింగ్ వాక్ విత్ పీపుల్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము అని ప్రతి గ్రామములో ప్రజా సమస్యలు, ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు తీరుని పర్యవేక్షించి పరిష్కార మార్గాలు చూపడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ప్రతి పేద కుటుంబానికి సహాయం చేయొచ్చు అని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ చెప్పాడు.పలు ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించాడు,గుడిపల్లి మండలం లో 10 మందికి కళ్యాణ లక్ష్మీ, శాదిముబారక్ చెక్కులను అందించాడు. జిల్లా పరిషత్ హై స్కూల్ లో గున్రెడ్డి రమణారెడ్డి కలవేదిక ni ప్రారంభించాడు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అర్జున్ రాంప్రసాద్ పటానికి నివాళులు అర్పించారు. పలు కార్యక్రమా లు నిర్వహించే దానికి మార్నింగ్ వాక్ విత్ పీపుల్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము అని చెప్పాడు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం పేదలు పడే బాధని పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుందని చెప్పాడు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలునాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్, కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చంద్ర రెడ్డి, శీలం శేఖర్ రెడ్డి, భూతం సైదులు, నీలం శ్రీనివాస్ యాదవ్, ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్,శ్రీను,గోవర్ధన్, వెంకటేశ్వర రెడ్డి, తహశీల్దార్ మధుహాసిని, ఎంపీ వో, ఎంపిడిఓ, బాలు చౌహాన్ మాజీ ఎంపీటీసీ లు సర్పంచులు ఎన్ ఎస్ యూ ఐ నాయకులు పాల్గొన్నారు.