Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 2 4 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ

ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా రోటరీఐకాన్స్ వారి రాజమహేంద్రవరం వారు ఈరోజు ప్రత్యేకమైన పోలియో అవేర్‌నెస్ ర్యాలీను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు మరియు ఆదిత్య కాలేజ్ విద్యార్థులు ఎన్సిసి నాగేశ్వరరావు పాల్గొన్నారు.ర్యాలీని పోలియో చైర్ డైరెక్టర్ రోటేరియన్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా,క్లబ్ ప్రెసిడెంట్ ఆర్ టి ఎన్ మండవెల్లి వెంకన్న బాబు,
చార్టర్డ్ ప్రెసిడెంట్ ఆర్ టి ఎన్ తీగల రాజా, మాట్లాడుతూ రోటరీ ఇంటర్నేషనల్ పోలియోని తూదముట్టించిందని 1985 నుండి ప్రపంచం అంతటికీ పోలియో అందించిందని నేడు ప్రపంచంలో పోలియో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో మాత్రమే ఓన్లీ స్మాల్ పర్సంటేజ్ ఉన్నదని ముందు జాగ్రత్త చర్యలుగా పోలియోపై సమరాన్ని కొనసాగిస్తూ పిల్లలందరికీ కూడా పోలియో డ్రాప్స్ ని యాంచాలని ఆ అవేర్నెస్ ప్రోగ్రాముగా ఈ ర్యాలీ ఏర్పాటు చేసినట్లు తెలియజేసినారు జరిగిందని తెలియజేసినారు,మరియు పాస్ట్ ప్రెసిడెంట్ ఆర్ టి ఎన్.వెంకట్ గారు క్లబ్ సెక్రటరీ రఘునాథ్ రాజు గారు, క్లబ్ ట్రెజరర్ ఆర్ టి ఎన్.దావూద్ గారు,రోటేరియన్లు వీరేంద్ర, నవీన్, ఐశ్వర్య, స్వాతి, అనుకుమార్, జోహార్ కృష్ణ, వజ్రాల, శ్యామ్ పొన్నాడ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.రోటరీ సభ్యులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం — రోటరీ క్లబ్ పోలియో నిర్మూలన కోసం చేస్తున్న సేవలను ప్రజలకు తెలియజేయడం మరియు ప్రతి పిల్లవాడికి పోలియో చుక్కలు వేయించడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించడం.1985లో రోటరీ ఇంటర్నేషనల్ ప్రారంభించిన “PolioPlus” కార్యక్రమం ద్వారా ప్రపంచాన్ని పోలియో రహితంగా మార్చే లక్ష్యంతో రోటరీ సభ్యులు నిరంతరంగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వ, ఆరోగ్య శాఖ డబ్ల్యూ హెచ్ ఓ, యూనిక్ ఎఫ్ వంటి సంస్థలతో కలిసి రోటరీ సమిష్టిగా పనిచేస్తూ, గ్రామీణ ప్రాంతాల వరకు పోలియో అవగాహనను విస్తరించింది.ఈ కృషి ఫలితంగా భారతదేశం 2014లో డబ్ల్యు హెచ్ ఓ చేత పోలియో రహిత దేశంగా గుర్తించబడింది.ఇది రోటరీ సంస్థల అంకితభావం, సేవాస్ఫూర్తికి నిదర్శనం.