విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్
జనం న్యూస్ 25 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా ఎన్.కోట పోలీసు స్టేషన్ 2018 సం.లో నమోదైన గంజాయి కేసులో డుంబ్రిగూడ మండలం, ఎ.ఎస్.ఆర్. జిల్లాకు చెందిన నిందితుడు (ఎ1) కిముడు జయరాం (22 సం.లు), సబ్బవరం మండలం, అనకాపల్లి జిల్లాకు చెందిన నిందితుడు (ఎ2) దత్తి ప్రవీణ్ (22సం.లు)లకు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు ఒక్కొక్కరికి రూ.20,000/- జరిమానా విధిస్తూ విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీమతి ఎం.మీనాదేవి అక్టోబర్ 23న తీర్పు వెల్లడించినట్టు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ తెలిపారు. విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసు స్టేషన్ పరిధిలో ఆకుల డిపో ప్రాంతంలో తే.20-12-2018 దిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై గంజాయి రవాణా చేస్తున్నట్టు రాబడిన ఖచ్చితమైన సమాచారంతో ఎస్.కోట పోలీసులు ఆకుల డిపో వద్దకు చేరుకొని అనుమానాస్పదంగా ఉన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ద్విచక్ర వాహనం తనిఖీ చేసి 3.750 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, అప్పటి ఎస్. కోట పోలీసు స్టేషన్ ఎస్ఐ ఎస్.అమ్మి నాయుడు కేసు నమోదు చేయగా, అప్పటి ఎస్. కోట సిఐ బి. వెంకటరావు దర్యాప్తు చేపట్టి, నిందితులను అరెస్టు చేసారన్నారు. తదుపరి ఎస్.కోట సిఐగా బాధ్యతలు చేపట్టిన బి.శ్రీనివాసరావు కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసారు. కోర్టు విచారణలో నిందితులు (ఎ1) కిముడు జయరాం (22 సం.లు), (ఎ2) దత్తి ప్రవీణ్ (22 సం.లు)లపై నేరారోపణలు రుజువు కావడంతో నిందితులకు విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీమతి ఎం.మీనాదేవి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు ఒక్కొక్కరికి రూ.20,000/- జరిమానా విధించారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో పోలీసుల తరువున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.సత్యం వాదనలు వినిపించగా, ఎన్. కోట పోలీసు స్టేషన్ కోర్టు మహిళా కానిస్టేబులు పి. సల్మ, సి.ఎం.ఎస్. కానిస్టేబులు కే.త్రినాధరావు సాక్ష్యులను సకాలంలో హాజరపర్చి నిందితుడికి శిక్షింపబడే విధంగా వ్యహరించారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ తెలిపారు. ఈ కేసులో ముద్దాయిలకు శిక్ష పడే విధంగా వ్యవహరించిన పోలీసు అధికారులని, సిబ్బందిని మరియు ఎపిపి గారిని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ అభినందించారు.


