Listen to this article

వెండి, బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు

జనం న్యూస్ అక్టోబర్ 25 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణ పరిధిలోని పటేల్‌గూడా మెట్రో బిహెచ్ఇఎల్‌ కాలనీ సమీపంలోని పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి దుండగులు దొంగతనానికి పాల్పడి భక్తుల్లో ఆందోళన రేపారు. దేవాలయ అర్చకుల సమాచారం ప్రకారం, రాత్రి సుమారు రెండు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో చొరబడి వెండి దాదాపు ఒక కిలో, అమ్మవారి మెడలో ఉన్న బంగారు పుస్తెలు, మంగళసూత్రం (సుమారు అర తులం) అలాగే భక్తులు సమర్పించిన కానుకలు, హుండీ నగదు సహా దాదాపు ఒక లక్ష రూపాయల విలువైన వస్తువులు ఎత్తుకెళ్లినట్లు అర్చకులు తెలిపారు.విషయం తెలిసిన వెంటనే అమీన్పూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్‌టీమ్ సహాయంతో ఫింగర్ ప్రింట్లు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న అమీన్పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.