Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం టీ ఆర్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజని కుమార్ యాదవ్..మేమెంతో మాకు అంత నినాదంతోనే టిఆర్పి పార్టీ ఏర్పడింది..రాబోయే 100 రోజుల్లో బహుజనుల డంక తెలంగాణ అంతటా మోగబోతోంది..బహుజన రాజ్యం దిశగా టీఆర్పీ.సంకల్పం..తెలంగాణలో బీసీలకు అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అందే వరకు పోరాటం చేస్తాం..మా వర్గాల ప్రజలందరినీ ఐక్యం చేసి బహుజనుల రాజ్యాన్ని తెలంగాణలో నెలకొల్పుతాం..తీన్మార్ మల్లన్న నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం మరింత ఉదృతం చేస్తాం..కొద్ది మంది ఉన్నవాళ్లు ఇచ్చుడేంది ఎక్కువమంది ఉన్నవాళ్లు తీసుకునిందని మండిపడ్డ టీ ఆర్ పి రాష్ట్ర కార్యదర్శి పల్లబోయిన అశోకు ముదిరాజ్..ప్రతి గ్రామంలో టీఆర్పీ జెండా గద్దె నిర్మించి జెండా ఎగురవేసి బహుజన ఉద్యమాన్ని గ్రామ స్థాయికి తీసుకెల్తాం తెలంగాణలో అగ్రవర్ణ పార్టీల కోటను బద్దలు కొట్టి బహుజన రాజ్యాన్ని స్థాపించేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) కట్టుబడి ఉందని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ కుమార్ యాదవ్ ప్రకటించారు. టీ ఆర్ పి రాష్ట్ర కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ శారద ఫంక్షన్ హాల్లో శుక్రవారం టిఆర్పి జిల్లా, నియోజకవర్గ కన్వీనర్లు కో కన్వీనర్లు నియామకంపై ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీ ఆర్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజనీ కుమార్ యాదవ్ పాల్గొని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా టిఆర్పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజని కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఇన్నాళ్లు బీసీల పేరుతో ఓట్లు సేకరించి అగ్రవర్ణాల పక్షాన నిలిచిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల అసలు స్వరూపాన్ని ప్రజల ముందుకు తెస్తామని హెచ్చరించారు. తెలంగాణలో బీసీలకు అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అందే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాజకీయ రంగం మాత్రమే కాదు, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల వరకు రిజర్వేషన్ అమలుకు టీఆర్పీ కట్టుబడి ఉందని అన్నారు. మా వర్గాల ప్రజలందరినీ ఐక్యం చేసి బహుజనుల రాజ్యాన్ని తెలంగాణలో నెలకొల్పుతామన్నారు . తీన్మార్ మల్లన్న నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం మరింత బలంగా కొనసాగుతుంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ వైఖరిని మార్చుకోకపోతే వారికి తెలంగాణలో రాజకీయ సమాధి తప్పదని అన్నారు. రాబోయే 100 రోజుల్లో బహుజనుల డంక తెలంగాణ అంతటా మోగబోతోందని ఆయన తెలిపారు. జిల్లా స్థాయి నాయకుల నియామకంపై సూచనలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది. మేమెంతో – మాకు అంత అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని నాయకులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో టీఆర్పీ జెండా ఎగురవేసి బహుజన ఉద్యమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్తామని తీర్మానించారు. సమావేశాన్ని విజయవంతం చేసిన నాయకులకు రజనీ కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్ర కార్యదర్శి పల్లబోయిన అశోకు ముదిరాజ్ మాట్లాడుతూ..ఉమ్మడి వరంగల్ జిల్లాలోని, వరంగల్ హనుమకొండ మహబూబాబాద్ జనగాం భూపాలపల్లి ములుగు జిల్లాల నియోజకవర్గ కన్వీనర్లు, కో కన్వీనర్లను నియమించడం కోసం టిఆర్పి ముఖ్య నాయకులతో చర్చ జరిగిందన్నారు. నాయకులందరూ వారి అభిప్రాయాలను తెలపడం జరిగిందని వారి అభిప్రాయాలను రిజర్వ్ చేసుకున్నామని టిఆర్పి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో టిఆర్పి వ్యవస్థాపకులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకు వెళ్లడం జరుగుతుందని మల్లన్న ఆదేశాల మేరకు నియామకాలు చేపడతామన్నారు. మేమెంతో మాకు అంత నినాదంతోనే టిఆర్పి పార్టీ ఏర్పడిందన్నారు. కొద్ది మంది ఉన్నవాళ్లు ఇచ్చుడేంది ఎక్కువమంది ఉన్నవాళ్లు తీసుకునిందని మండిపడ్డారు. తెలంగాణలో పిరికిడు ఉన్నవాళ్లు ఇచ్చుడేంది గంపడం నోళ్లు తీసుకునేది తప్పన్నారు . టిఆర్పి వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆలోచన మేరకు పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు అనేక స్పందన గ్రామాలలో కనబడుతుందన్నారు. అతి త్వరలో గ్రామాలలో పల్లెల్లో పట్టణాలలో టిఆర్పి జెండా గద్దె నిర్మించి బహుజన రాజ్యాధికారి కోసం నాయకులమంతా ఏకమై ఒక సైనికుల్లాగా పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని ముఖ్య నాయకులు, గౌతం రవి పటేల్, ఇనుకాల ప్రణయ్, తీన్మార్ జయ్ తెలంగాణ కొమ్మురయ్య. జనార్ధన్ సామల చంద్రశేఖర్, పిట్టల వెంకటేష్, జినుకు శ్రీనివాస్, సామల శ్రీలత, బత్తిని వెంకటేష్ గౌడ్, మాదం నరేష్ యాదవ్, గండి వెంకటేశ్వర్ల గౌడ్, పూజరి సత్యనారాయణ, బుగ్గిరాజు, సయ్యద్, ముతోజు రమేష్, పెండల సంపత్ పటేల్, గొర్రె సందీప్, ధర్మపురి రామారావు, ఆరెల్లి రాము గౌడ్, మాంచాల పద్మ, మహమ్మద్ ముస్తాద్, బండారి ఆగయ్య, భూక్య సంధ్య,వరిపల్లి అనిల్ కుమార్, కొమ్మినేని శరత్, దొడ్ల శంకర్, వరి పెళ్లి ప్రభాకర్, ధోని పెళ్లి రాజేష్, సింగారము రవీందర్, మంద దిలీప్, ఊదరి సతీష్, జిట్టబోయిన నరేష్ ముదిరాజ్, చిలకని మహేందర్, చిర్ర వీరస్వామి, టీఆర్పి మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు…