జనం న్యూస్ అక్టోబర్ 25 శాయంపేట
మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం లో ఉన్న నాగేంద్ర స్వామి గుడిలో శనివారం నాగుల చవితి వేడుకలు వైభవంగా నిర్వహించారు. దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి నాగదేవత విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేశారు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి రాజమణి దంపతులు పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు జరిపించారు నాగుల చవితి సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి నాగదేవతలను తమ కోరికలు నెరవేర్చాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో భాషని రమేష్ ధనలక్ష్మి శివ నాగరాజు మహిళల అధిక సంఖ్యలో పాల్గొన్నారు….


