తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి
జనం న్యూస్, అక్టోబర్ 25, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )
సిఐటియు జిల్లా అధ్యక్షులు సదబోయిన ఎల్లయ్య ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి, మాట్లాడుతూ,సమాజంలో జర్నలిస్టుల సేవలు మరువలేము. ప్రజల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, అన్యాయాలు వెలుగులోకి తెచ్చే బాధ్యత జర్నలిస్టులది అన్నారు ,తెలంగాణ ఉద్యమం మొదలుకుని రాష్ట్ర నిర్మాణం వరకు జర్నలిస్టులు ఎంతో కష్టపడి ప్రజల స్వరాన్ని ప్రపంచానికి వినిపించారు. ప్రతి ఉద్యమం విజయానికి జర్నలిస్టులే ప్రధాన కారణం,అని అన్నారు.ప్రజల పక్షాన నిలబడి రాతలతో, మాటలతో న్యాయం కోసం పోరాడే జర్నలిస్టులకు సమాజం గౌరవం ఇవ్వాలన్నారు. జర్నలిస్టుల భద్రత, స్వేచ్ఛ కాపాడడం అందరి బాధ్యత” అని తెలిపారు.ఈ సందర్భంగా టీజేయూ జిల్లా అధ్యక్షుడు మరాఠీ కృష్ణమూర్తి మాట్లాడుతూ, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు టీజేయూ అండగా ఉంటుంది. జిల్లాలో ప్రతి విలేకరి సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తాము. ప్రజల సమస్యలు, బహుజన హక్కుల కోసం కూడా సమానంగా పోరాటం కొనసాగిస్తాము అన్నారు.ఈ కార్యక్రమంలో టీజేయూ నాయకులు, జనసమితి ప్రతినిధులు, సామాజిక నాయకులు పాల్గొన్నారు.


