జనం న్యూస్ అక్టోబర్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని కాట్రపల్లి గ్రామంలో పాఠశాల ఆవరణలో గ్రామంలోని పశువులకు స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ యం.సునిల్ ప్రజ్వాల్ సంస్థ సంయుక్తంగా గ్రామంలోని 105 తెల్లజాతి పశువులకు నల్లజాతి 60 జీవాలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయటం జరిగింది అనంతరం ప్రజ్వాల్ సంస్థ ప్రతినిధి డి. రవిచందర్ మాట్లాడుతూ మూగజీవాలు వాటి బాధలను చెప్పలేవని ముందుగానే రైతులు నివారణకు టీకాలు వేసుకొని మూగజీవాలను రక్షించు కోవాలని రైతులు ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్త పడాలని వివరించారు
ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది సి ఎచ్ రమేష్ బాబు వి ఎల్ ఓ. పి. రవి జే వి ఓ ఎన్ సదానందం వి ఎ గ్రామ రైతులు వంకుడోతు దన్ సింగ్ వంకుడోతు. బాబూసింగ్ మీసరాగoడ్ల స్వామి మీసరాగాండ్ల. సంపత్ జనగాం. మొగిలి పెద్దపల్లి పాణి ఒంటెరు ప్రసాద్ నవయుగ సొసైటీ డైరెక్టర్ ఒంటెరు. రాజయ్య తదితరులు పాల్గొన్నారు…..


