జనం న్యూస్ అక్టోబర్ 25 నడిగూడెం
మండల పరిధిలోని వల్లాపురం నుంచి నారాయణపురం వరకు గ్రామీణ రహదారి నిర్మాణం శరవేగంగా సాగుతోంది. సీఆర్ఆర్ నిధుల కింద మంజూరైన రూ.2.20 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. మరో రెండు రోజుల్లో పనులు పూర్తికానున్నట్లు స్థానిక కో-ఆర్డినేటర్ నాగిరెడ్డి వెంకటరెడ్డి శనివారం తెలిపారు. కొన్నేళ్లుగా రాకపోకలకు ఇబ్బంది పడిన ప్రజలు, ఇప్పుడు ప్రయాణం సులభతరం కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


