జనంన్యూస్. 25.సిరికొండ.
బిసి రిజర్వేషన్ల అమలు కోసం ప్రజా పోరాటంకు సిద్ధం కావాలి.సీపీఐ(ఎం.ఎల్.)మాస్ లైన్ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు వి.ప్రభాకర్ పిలుపు.బిసి రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని,.బిసి రిజర్వేషన్ల అమలు కోసం ప్రజా పోరాటంకు సిద్ధం కావాలని.సీపీఐ(ఎం.ఎల్.)మాస్ లైన్ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు వి.ప్రభాకర్ పిలుపునుఇచ్చారు . శనివారం నాడు సిరికొండ బిసి జేఏసి ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో కలిపి రౌండ్ టేబుల్ సమావేశం ని నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఐ(ఎం.ఎల్.)మాస్ లైన్ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు వి.ప్రభాకర్ మాట్లాడుతూ:బిసి లు అనేక ఏళ్లుగా అనగాదొక్కబాడుతున్నారని, అన్నిటికి దూరం అయ్యారు అన్నారు. అణిచి వేత, అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాలన్నారు. రిజర్వేషన్ల విషయంకూ వచ్చేసరికి మెరిట్ అని అంటున్నారని. కింది కులాలకు సంబంధించిన ప్రతిభ ఉన్నంత అగ్రవారాలకు లేవన్నారు. అన్ని పార్టీలు బిసి ఉద్యమానికి మద్దతిస్తున్నప్పుడు అందరూ బాపనోళ్లే కాని రొయ్యల ముల్లెయాడికి పోయింది అన్నారు. సిరికొండ బిసి జేఏసీ ఐక్యంగా ఉద్యమాలను నడిపించాలని, జిల్లా రాష్ట్ర జేఏసికి ఆదర్శంగా నిలవాలన్నారు. బిసి ఉద్యమాన్ని అన్ని వర్గాల ప్రజలను తో ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు.బానిసత్వం వదిలి పోరడుదాం.జిల్లా బిసి జేఏసి నాయకులు లోలం. గంగాధర్, ఎండల ప్రదీప్ జిల్లా బిసి జేఏసి నాయకులు లోలం. గంగాధర్, ఎండల ప్రదీప్ లుమాట్లాడుతు: అన్ని పార్టీలో బానిసలుగా ఉన్న బీసీల అంతా ఐక్యమై పోరాట స్వరము వినిపించాలన్నారు. అలా పోరాడిన నాడే మన బీసీ రిజర్వేషన్లు అమలు అమలు చేసుకోగలుగుతామన్నారు. పోరాడనిదే మన బిల్లును పొందలేమని అన్నారు. ప్రియమైన అసెంబ్లీలో కాంగ్రెస్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించి ఒక ముందడుగు వేసిందన్నారు. బీసీ బిల్లు అనే బాల్ బిజెపి పార్లమెంటు ముందు ఉందన్నారు. పార్లమెంట్లో శాసనం చేసి రాష్ట్రపతి గవర్నర్ చేత ఆమోదింప చేసే బాధ్యత బిజెపి పైన ఉందన్నారు. అందరూ అన్ని వర్గాలం బీసీల ఐక్యంగా ఉండి మన బిల్లు మన సాధించుకుందాం అని పిలుపునిచ్చారు. కార్యక్రమంకూ మండల జేఏసి నాయకులు నరేష్ అధ్యక్షత వహించాగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకారం. రవి, సీపీఐ(ఎం. ఎల్.) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ, బిజెపి జిల్లా నాయకులు సిఎచ్.రామస్వామి,బిఆర్ ఎస్.జిల్లా నాయకులు ఇ. గోపాల్, ఎంప్లాయిస్ జేఏసి నాయకులు ఎం. నాగరాజు, కె. రాజేశ్వర్, మాజీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎం. బాల్ నర్సయ్య, ఎం. ఆర్. పి. ఎస్ జిల్లా నాయకులు ఎన్. రాజేందర్, ప్రజాసంఘాల నాయకులు బి. గంగారెడ్డి, కాంగ్రెస్ బిసి నాయకులు గ్యామ.శోభన్, బిసి జిల్లా నాయకులుకె.గోపి, ఎం.మహిపాల్, ఇ. రమేష్ లు ప్రసంగాంచారు. కార్యక్రమంలో బి. బాబన్న, ఆర్. దామోదర్, కె.బాపూరావ్, గడ్డాల.సురేందర్, U. రమేష్, తదితరులు పాల్గొన్నారు.


