Listen to this article

సేవచేయడమే నా లక్ష్యం -గజవాడ సాయి తేజ

జనం న్యూస్, అక్టోబర్ 25, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )

సిద్దిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో ప్రముఖ వ్యాపారవేత్త గజవాడ మనోహర్,కుమారుడు యువ నాయకుడు గజవాడ సాయి తేజ,సిద్దిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం సహాయ కార్యదర్శిగా పోటీ చేస్తున్నారు, శనివారం సిద్దిపేట పట్టణ కేంద్రంలో గజవాడ సాయి తేజ, మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిద్దిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో సహాయ కార్యదర్శిగా పోటీ చేస్తున్న నాకు ఎన్నికల్లో ఆర్యవైశ్యుల అండ కావాలని కోరుకుంటూ,నవంబర్ 9 న సిద్దిపేటలో నిర్వహించే ఎన్నికల్లో ఆర్యవైశ్య ఓటర్లు పాల్గొని నాకు కేటాయించిన కొబ్బరికాయ గుర్తు సీరియల్ నెంబర్ 9 పై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ యువత అన్ని రంగాల్లో రాణించాలని అందుకే ఆర్యవైశ్య సమాజానికి సేవ చేయాలనే అంకితభావంతో మీ ముందుకు రావడం జరుగుతుందని ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి నా వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నాకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ, తప్పకుండా ప్రతి ఒక్క ఓటరు ఎన్నికల్లో పాల్గొనాలని కొబ్బరికాయ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.