ఎమ్మెల్యే విజయ్ కుమార్
జనం న్యూస్, అక్టోబర్ 25,అచ్యుతాపురం :
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో అచ్యుతాపురం మండలం మల్లవరం గ్రామంలో ప్రతి ఏడాది నాగుల చవితి రోజున జరిగే జాజులమ్మ తల్లి ఊరేగింపులో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు తెలుపుతూ పండుగలు కుటుంబాల కలయికలకు,అనుబంధాలు ఆత్మీయతలు కొనసాగడానికి ఉపయోగపడతాయని అన్నారు. ప్రతి హిందూ పండుగలోనూ ఒక పరమార్థం దాగి ఉంటుందని, వాటిని తూచా తప్పకుండా ఆచరించడం మనందరి బాధ్యత అని అన్నారు. చెట్లను, పక్షులను, జంతువులను కూడా దేవుళ్ళుగా భావించి పూజించడం హిందూ సాంప్రదాయంలో ఒక భాగం అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,యువకులు, పెద్దలు,కూటమి నాయకులు తదిత రులు పాల్గొన్నారు.


