వారం రోజుల పాటు కార్యాలయాలలో అందుబాటులో ఉండాలి, ఎంపీడీవో, తాసిల్దార్,
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఎంపీడీవో కె ఆర్ ఎం ప్రసాద్ తాసిల్దార్ అమరేశ్వరి, డిప్యూటీ ఎంపీడీవో సునీల్ కుమార్, మండలపరిషత్ కార్యా లయంలో శనివారం కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ఈ కాన్ఫరెన్స్ నందు మండల పరిషత్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేటి నుంచి 30 తేదీ వరకు అనగా వారం రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున మండలంలోని అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు,సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు,ఫోన్ కాల్స్ వస్తే తక్షణమే స్పందించాలని దోమల నివారణ కొరకు బ్లీచింగ్ చల్లడం చెయ్యేరు దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం పంచాయతీ వారు ప్రజలకు అవగాహన కల్పించేందుకు మైకుల ద్వారా సమాచారం తెలపాలని చెరువులు వాగులు రోడ్ల పరిస్థితులపై పర్యవేక్షణ చేయాలని ప్రతిరోజు ఫోటోలు వాట్సాప్ లో ఎంపీడీవో కి పంపాలని తెలిపారు, ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఏఎన్ఎంలు అందుబాటులో ఉండాలని, అధికారులు సిబ్బంది ప్రధాన కార్యాలయాలలోనే విధులు నిర్వహించాలని సమాచారం కోసం మండల కంట్రోల్ రూమ్ 944179 3487 నెంబరుకు ఫోన్ చేయాలని తెలిపారు, ఈ కాన్ఫరెన్స్ లో మండల అభివృద్ధికార్యాలయ సిబ్బంది ,రెవెన్యూ కార్యా లయ సిబ్బంది, గ్రామ సచి వాలయాల సిబ్బంది తది తరులు పాల్గొన్నారు,



