జనం న్యూస్ అక్టోబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సేవా సంస్థ విజయవాడ పాయకాపురంలో వాసవిక్లబ్స్ రీజనల్ కార్యాలయం లో ఆర్యవైశ్య పాత్రికేయులకు జరిగిన అభినందన కార్యక్రమంలో ఒంగోలు నగరానికి చెందిన ఫ్రీలా న్స్ జర్నలిస్ట్ రాధారమణ గుప్తా జంధ్యంను సత్కరించారు. ఈ సందర్భంగా రాధా రమణ గుప్తా జంధ్యంను నెమ్మాని సీతారామమూర్తి, మాగంటి శ్రీనివాసమూర్తి, ఎం విఎస్ శాస్త్రి, పోన్నూరు వెంకట శ్రీనివాసులు, ధనిశెట్టి రామునాయుడు, నేరెళ్ల శ్రీనివా సరావు, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు, శ్రీగిరి గిరిప్రదక్షిణ కమిటీ సభ్యులు, వాసవి క్లబ్స్ సభ్యులు, యోగాసనా భారత్ సభ్యులు మరియు పలు సంఘ ప్రతినిధులు, పత్రి కాధిపతులు అభినందించారు. వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సేవా సంస్థ ప్రోగ్రామ్ ఆఫ్ ది ఇయర్ వార్షిక కార్యక్రమము కమ్యూనిటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న ఆర్యవైశ్య విలేకరులు 200 మందిని కలం యోధులకు అభినందన మాల పేరుతో విజయవాడ పాయకాపురంలో వాసవి క్లబ్స్ రీజియన్ కార్యాలయంలో జరి గిన కార్యక్రమంలో ఘన సత్కారం చేశారు. వాసవిక్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు ఇరు కుల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాళ్లయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతులు శివ స్వామీజీ, విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కా ర్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్, అతిథిగా ఆంధ్రప్రదేశ్ వాసవి కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య జర్నలిస్టుల సేవా సంక్షేమ సంఘం కన్వీనర్ సిహెచ్ రవికుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్స్ అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ మాట్లా డుతూ స్వాతంత్ర సమరయోధులు, వాసవి క్లబ్ వ్యవస్థాపకులు స్వర్గీయ కల్వకుంట్ల చంద్రసేన గుప్త ఎలాంటి ఆలోచనతో వాసవి క్లబ్ ను 1961లో స్థాపించారో అదే ఆలా “చనను కొనసాగిస్తూ. ఈ సంవత్సరం వార్షిక కార్యక్రమాలలో కమ్యూనిటీకి పెద్దపీట వేయడం జరిగిందని మరియు వాసవి క్లబ్స్ సభ్యుల సమిష్టి శక్తితో వార్షిక కార్యక్రమాల సూచికతో పాటు విశేషమైన 65 అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిం దని, వాటన్నింటినీ మరియు సామాజిక బాధ్యతతో సమాజంలో జరుగుతున్న సంఘ టనలను వార్తల రూపంలో ప్రజల మధ్యకు తీసుకువెళ్లే ఆర్యవైశ్య పాత్రికేయులను స త్కరించుకోవడం మా బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. వాసవి క్లబ్స్ ద్వారా ఈ సంవత్సర కాలంగా జరిగిన కార్యక్రమాలను వివరించారు.కార్యక్రమంలో అతిధుల చేతుల మీదుగా కలం యోధులకు మెమెంటో, ప్రశంసాపత్రం మరియు కానుకను అందించారు. కార్యక్రమంలో డాక్టర్ సి. ఎస్. కుమార్, సెంథిల్ కుమార్, వంకదర వా సుదేవరావు, యదా నాగేశ్వరరావు, సుజాత రమేష్, బోడా సూర్య ప్రకాష్ రావు, శిద్దా సూర్యప్రకాష్, తదితర వాసవి క్లబ్స్ అధికారులు పాల్గొన్నారు



