జనం న్యూస్ అక్టోబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ( కాట్రేనికోన)
మొంథా తుఫాను తీవ్రత అంబేద్కర్ కొనసిమ జిల్లా పై ప్రభావం ఎక్కువగా చూపుతుంది అని వాతావరణ శాఖ సమచారం మేరకు అదికార యంత్రంగం అప్రమత్తమైంది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అదేశాలతో కాట్రేనికొన మండలంలోని తీర ప్రాంత మత్స్యకార ప్రజలను పొలిసు శాఖ అప్రమత్తం అయింది పల్లపు ప్రాంతాలు ప్రజలను సి,ఐ మొహన్ కుమార్ అధ్వర్యంలో పడవలపై తుఫాన్ షెల్టర్లకు తరలిస్తున్నసరు గ్రామలొ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మండల పరిధిలోని బలుసు తిప్ప,. మగసాని తిప్ప గ్రామ ప్రజలతోపాటు తాటాకు ఇళ్లలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు..ఈసందర్బంగా సిఐ మోహన్ కుమార్ మాట్లాడుతూ మొంథా తుఫాను తివ్రత వల్ల ప్రజలు భయపడవద్దు అని 24గంటలు పొలీస్ మికు అండగా వుంటుంది అన్నారు ఎలాంటి విపత్కర పరిస్థితులనైన ఎదుర్కొనేందుకు అదికార యంత్రాంగం సిద్దంగా వుంటుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మమ్మీ, తాసిల్దార్ కిరణ్, సిఐ మొహన్ కుమార్ ఎస్సై అవినాష్,ఎంపిడివో వెంకటచలం,గ్రామ పెద్దలు,రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.



