Listen to this article

కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తుల వెల్లువ

జనం న్యూస్, అక్టోబర్ 27 సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం

అమీన్పూర్ మండలం బీరంగూడలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు.తెల్లవారుజాము నుంచే భక్తులు హారతులు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ స్వామివారి దర్శనంతో తృప్తి చెందారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో శశిధర్ గుప్తా ఆధ్వర్యంలో, ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ నేతృత్వంలో విశేష ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం తాగునీటి సదుపాయం, క్యూ లైన్‌ వ్యవస్థ, పార్కింగ్‌ సదుపాయాలు కల్పించారు.కార్తీక మాసం ప్రతి సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.