జనం న్యూస్ అక్టోబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మార్పుచెందింది. నేడు, రేపు తుపానుగా మారి మంగళవారం రాత్రి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉండటంతో కొత్తపేట నియోజకవర్గ అధికారులు,ముందుజాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని , ప్రజలను అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకొని అవసరమైతే స తుఫాన్ తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులుతో పాటు రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మరీ ముఖ్యంగా విద్యుత్ శాఖ వినియోగదారులు, రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యుత్ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు వారికి తగిన సమాచారం అందించాలి. ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలి.విద్యుత్ శాఖకు సంబంధించి జిల్లాలో అమలాపురం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ అధికారులు సూచనలు పాటించాల్సిందిగా కోరుచున్నాను.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి పూర్వపు అధ్యక్షులు యాళ్ల దొరబాబు దొరబాబు


