Listen to this article

జనం న్యూస్ //జనవరి 30//జమ్మికుంట //కుమార్ యాదవ్..
జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన మృతుల కుటుంబాలకు బియ్యం పంపిణీ తో పాటు నగదు అందజేశారు.
జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన పుల్లూరీ ఓదెలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబానికి గురువారం రోజున పిఎంకె ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్ ఆదేశాల మేరకు పుల్లూరి ఓదెలు కుటుంబానికి 50 కిలోల బియ్యంతో పాటు 2500 నగదు ను అందించారు.
అదేవిధంగా గ్రామానికి చెందిన పింగిలి శ్రీకాంత్ కూతురు లక్కీ ఇటీవల అనారోగ్యంతో చనిపోగా వారి కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పిఎంకె ఫౌండేషన్ నిర్వాహకులు పల్లె రవి గౌడ్ ,గండి రంజిత్ కుమార్ గౌడ్ ,గిరవేన రాజయ్య, యాదవ్ గిరవేన బిక్షపతి యాదవ్, బండారి శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.