జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 27 రిపోర్టర్ సలికినీడి నాగు
ఈరాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసిందని, గిరిజన వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని ఆంద్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీను నాయక్ అన్నారు.సోమవారం పట్టణ సీపీఐ కార్యాలయంలో అయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా మాచర్ల ల్లో గిరిజన బాలుర వసతి గృహం స్లాపులు పెచ్చులుడుతున్నాయి.చిలకలూరిపేట పట్టణ శివారులో ఉన్న గిరిజన గురుకుల పాఠశాల పరిస్థితి అదే విధంగా ఉందని, కనీసం మరుగుదొడ్లు లేవు అన్నారు. ఈ పాఠశాలకు సంబంధించి మండలంలోని కమ్మవారిపాలెం వద్ద ఎ 2.50 సెండ్ల స్థలం కేటాయించి రూ.4 కోట్లు ప్రణాళికలు రూపొందించామని చెప్పి నేటికి ఒక ఇటుక కూడా వేయలేదన్నారు.పల్నాడు జిల్లా ల్లో ఎస్సి,బి.సి వసతి గృహాలు మూత బడ్డాయి.తక్షణమే పునరుద్ధరించాలని ప్రభుత్వని కోరారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో గిరిజన కళాశాల వసతి గృహానికి మరుగుదొడ్లు మరమ్మతులు చేయించడంలో గిరిజన శాఖ అధికారులు విఫలమయ్యారన్నారు. ఫ్యాన్లు, లైట్లు లేక దోమలు పెడతతో గిరిజన విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన గురుకుల వసతి గృహాల విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిధులు కేటాయించామని చెబుతున్న అధికారులు కనీస మరమ్మతులు ఎందుకు చేయించడం లేదని పలు ప్రశ్నలు సందించారు.శిథిలావస్థల్లో ఉన్న గిరిజన వసతి గృహాలను, ప్రైవేట్ భవల్లో మార్చాలన్నారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత యువజన సమాఖ్య కన్వీనర్ బి.రాంబాబు నాయక్ పాల్గొన్నారు.


