Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 27 సంగారెడ్డి జిల్లా

పటాన్ చేరు ప్రపంచంలోని అన్ని మతాలకు భారతదేశం నిలయమని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. బొల్లారం లో జనసేవ సంఘ్ ఛట్ పూజ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఛట్ పూజ కార్యక్రమంలో పాల్గొని పూజ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోదీ చొరువ తోమన దేశం అన్ని మతాలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తూ.. అందరి పండగలను గౌరవిస్తుందన్నారు. ఛట్ పూజ చేసేవారు అత్యంత నిష్ఠగా నహాయ్‌ఖాయ్ ఆచరిస్తారని తెలిపారు. ఎక్కువగా మహిళలే ఈ వ్రతాన్ని ఆచరించి తమ మొక్కులను చెల్లించుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు ఆనంద్ కృష్ట రెడ్డి తదితరులు ఉన్నారు.