

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 30 రిపోర్టర్ సలికినిడి నాగరాజు
పట్టణంలోని 38వ వార్డు లో వైయస్సార్ కాలనీ నందు ఇస్లావతు సాత్విక ఎనిమిదో తరగతి చుదువుతుంది. కీర్తి రూరల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దుల వెంకట కోటయ్య రూ 7000వేలు ఫీజుల నిమిత్తం సహాయం చేయడం జరిగింది. టిడిపి సీనియర్ నాయకులు జంగా వినాయక రావు చేతుల మీదుగా ఈ ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగిందని గురువారం ఆయన తెలిపారు.మద్దుల వెంకట కోటయ్య గెస్ట్ హౌస్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ 2009వ సంవత్సరంలో కీర్తి రూరల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ సర్వీస్ సొసైటీని స్థాపించడం జరిగిందని, పేద విద్యార్థిని, విద్యార్థులకు, తమ వంతుగా చేయూతను అందించడమే కాకుండా ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా పలు గ్రామీణ ప్రాంతాల్లో అగ్నికి ఆహుతి అయి సర్వం కోల్పోయిన కుటుంబాలకు సహాయ, సహకారాలు అందిస్తున్నామన్నారు. మును ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధమవుతున్నట్టు ఆయన తెలిపారు.