


మహాత్మాగాంధీ చిరస్మరణీయుడు — నరేందర్ రెడ్డి
-మహాత్మా గాంధీ సేవలు మరువలేనివి –
జగ్గయ్యగారి శేఖర్
జనం న్యూస్ జనవరి 30, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపెట్ హనుమాన్ దేవాలయం వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అధ్యక్షుడు, ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ మండల అధ్యక్షుడు జగ్గయ్యగారి శేఖర్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి,నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ మహాత్మా గాంధీ చిరస్మరణీయుడు అని భారత దేశానికి స్వాతంత్ర్యం కోసం ముఖ్య భూమిక పోషించిన మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అహింస మార్గంగా భారతదేశానికి స్వాతంత్రం కోసం ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమం చేసి భారతదేశానికి స్వాతంత్రం కోసం విశేష కృషి చేసిన మహాత్మా గాంధీ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిద్ధి బిక్షపతి, సమీర్, గాడిపల్లి శ్రీనివాస్, డాక్టర్ వహీద్,నక్క రాములు గౌడ్,రమేష్, కొండల్ రెడ్డి,కైలాస ప్రశాంత్,ఉమేష్, సబ్బని నరేష్ తదితరులు పాల్గొన్నారు