Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

ఏ.వి.వి.పురం కాలనీలో జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి కాలనీ ప్రెసిడెంట్ గా పెద్దింటి సింహాద్రి మరియు జనరల్ సెక్రటరీ గా కలమట వెంకటరావు ఘన విజయం సాధించిన జనసైనికులు, ఈ శుభ సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంలో ప్రేమ కుమార్ మాట్లాడుతూ ఈ విజయం కేవలం వ్యక్తిగత గెలుపు మాత్రమే కాదు, ప్రజల విశ్వాసానికి ప్రతీక, ప్రజలతో ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం కోసం కృషి చేయడం ద్వారా మాత్రమే మనం నిజమైన ప్రజా సేవకులమవుతాం అని తెలిపారు. అనంతరం విజయం సాధించిన నేతలకు శాలువాలు తో సన్మానిస్తూ భవిష్యత్తులో మరింత బలంగా ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు జనసేన నాయకులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.