Listen to this article

రోగుల అవస్థలు- అత్యవసర సర్వీసులకు ఆటంకం

జనం న్యూస్- అక్టోబర్ 29- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-

ఆసుపత్రి అత్యవసర మార్గాలను అడ్డుకోకుండా, అత్యవసర రోగులు సులభంగా ఆసుపత్రిలోపలికి ప్రవేశించడానికి అంబులెన్స్‌లు సులభంగా రాకపోకలు సాగించడానికి ప్రధాన ప్రవేశ ద్వారా అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రవేశ ద్వారానికి అడ్డంగా వాహనాలను నిలిపితే అత్యవసర చికిత్స కోసం అంబులెన్స్ లో వచ్చే రోగుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకుంటేనే ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి ఘటనే నిత్యం నందికొండ మున్సిపాలిటీలోని స్థానిక కమలా నెహ్రు ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకుంటుంది . ఇది వంద పడకల ఆసుపత్రి కావడంతో నిత్యం అత్యవసర రోగులతో రద్దీగా ఉంటుంది ఈ ఆసుపత్రి ప్రధాన ప్రవేశ ద్వారాం వద్ద మంగళవారం ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్లకు చెందిన వాహనాలు ద్విచక్ర వాహనాలు అడ్డుగా నిలిపి ఉంచటం కనిపించింది ఈ ఆసుపత్రికి ఇదే ప్రధాన ప్రవేశ మార్గం ఇది తప్పితే వేరే మార్గం లేదు. వాహనాల పార్కింగ్ కు ఇక్కడ అవకాశం లేదని చెప్పాల్సిన ఆసుపత్రి సిబ్బందే వారి వాహనాలను ప్రవేశ ద్వారానికి అడ్డంగా పార్కింగ్ చేయటం రోగులకు సందర్శకులకు అంబులెన్స్ లకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుంది.ముఖ్యంగా ఇది అంబులెన్స్‌ల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. అంబులెన్స్ లో ఉన్న అత్యవసర రోగులను కిందకి దించి స్ట్రెచర్ మీద లోపలికి తీసుకువెళ్లాలంటే వాహనాలు అడ్డుగా ఉండటం వలన తీవ్ర జాప్యం జరిగి సకాలంలో రోగికి చికిత్స అందించాల్సిన సమయం వృధా కావటంతో పాటు రోగి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది . ఇంత పెద్ద ఆశపత్రిలో పార్కింగ్ స్థలం ఉన్నా కూడా ఆసుపత్రి సిబ్బంది వాహనాలను ఇలా ప్రవేశద్వారానికి అడ్డంగా నిలపడం ఎంతవరకు సమంజసమని ఆసుపత్రికి వచ్చిన రోగులు ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బందికి చెందిన తేలికపాటి వాహనాలను ద్విచక్ర వాహనాలను వారికి నిర్దేశించిన పార్కింగ్ స్థలంలోనే పార్కింగ్ చేయాలని ఇలా ప్రవేశద్వారం వద్ద పార్కింగ్ చేసిన వాహనాలపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆసుపత్రికి వచ్చిన రోగులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు