సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ అక్టోబర్ 29
రాష్ట్ర స్థాయి గో సేవ విజ్ఞాన పరీక్షలో విద్యాభారతి విద్యార్థికి 4వ స్థానం
ఆదివారం హైద్రాబాద్ కేశవ్ మెమోరియల్ స్కూల్ లో రాష్ట్ర స్థాయి గో సేవ విజ్ఞాన పరీక్షలు నిర్వహించారు అన్ని జిల్లాలనుండి 1987 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా నుండి 34 మంది పాల్గొన్నారు. ఈ విజ్ఞాన పరీక్షలో విద్యా భారతి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న శాన్వి రెడ్డి రాష్ట్ర స్థాయిలో 4వ స్థానంలో నిలిచింది. ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతి మరియు ప్రశంసా పత్రం అందుకుందని విద్యాభారతి పాఠశాల ప్రిన్సిపాల్ టి. కృష్ణారెడి ఒక ప్రకటలో పేర్కొన్నారు. అలాగే మరొక విద్యార్థి నికితకు జిల్లాస్థాయి బహుమతి లభించిందని తెలిపారు.



