Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు లో మొంథా తుఫాన్ కారణంగా దుకాణాలు సముదా యాలు మూత పడడంతో యాచకులకు నిరుపేదలకు పూట గడవని పరిస్థితి నెలకొంది. ఎడతెరపని వర్షం కురవడంతో బిచ్చగాళ్లకు బయటికి వెళ్లలేని పరిస్థితి.ఈ క్రమంలో నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టెంట్ మెంబర్ మరియు బీజేపీ నాయకులు రాచూరి మురళి, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అఫ్ ఇండియా జిల్లా చైర్మన్, డాక్టర్ వేపకుంట డేవిడ్ కళ్యాణి రాజు,మాజీ ఎంపీటీసీ మాడపూరి శ్రీరాములు,టిడిపి పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్,,విస్డం స్కూల్ అధినేత వలిమి సుధాకర్,పొంబల శివ నరసింహులు తదితరులు అందరూ కలిసి నందలూరులోని రైల్వేస్టేషన్, అరవపల్లి,మగ్దమ్ షా వల్లీ దర్గా ఎర్రపాపాయపల్లి మరియు గుండ్లూరు శివాలయం పరిసరాలలో యాచుకులకు అన్నం పొట్లాలు అందజేసి తమ ఉదార త్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా పలువురు గ్రామ వాసులు వారి సేవ నిరతిని అభినందించారు.