Listen to this article

జనం న్యూస్ జనవరి 31 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ దావోస్ లో చంద్రబాబు నాయుడు చురుకుదనం, మైనస్ 7 డిగ్రీల చలిని యువకులు సైతం తట్టుకోలేకపోయామని చంద్రబాబు నాయుడు షట్టర్ కూడా వేసుకోకుండా సాధారణ డ్రస్సులోనే మాతోపాటు పారిశ్రామికవేత్తలకు కూడా ఆశ్చర్యం కలిగించిందని, చంద్రబాబు నాయుడు విజనరీ నాయకుడని, బ్రాడ్ మెంటాలిటీ తెలిసిందని, ఏపీకి పెట్టుబడులు రప్పించేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు అద్వితీయమని మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కోసం అభివృద్ధి కోసం, నిరుద్యోగ నిర్మూలన కోసం తన మేధాశక్తిని పనంగా పెడుతున్నారని చంద్రబాబుని కొనియాడారు. సదరు విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కొనియాడడం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ మరియు కాంగ్రెస్ జగన్ రెడ్డి గ్యాంగ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు షర్మిల కళ్లు తెరిచి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని నాగ జగదీష్ హితువు పలికారు. వైసీపీ మాజీ మంత్రి ఆంబోతు రాంబాబు, తిరుమలలో స్వామి టికెట్లు అమ్ముకున్న దళారి రోజా, కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ దావోస్ వెళ్లి తండ్రి కొడుకులు ఉట్టి చేతులతో వచ్చారని వ్యాఖ్యలు చేయడం, ప్రజలు బుద్ధి చెప్పిన వీళ్లలో అహంకారం తగ్గలేదని అధికార దర్పణం దోచుకున్న డబ్బు వల్ల తగ్గలేదని, ఇప్పటికైనా అహంకార మాటల కట్టుపెట్టి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని నాగ జగదీష్ హితువు పలికారు. పెట్టుబడిల విషయo లో చంద్రబాబు లోకేష్ వ్యూహాత్మకంగా ఉన్నారని విషయం నాకు అర్థమైందని తెలంగాణ ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలియజేయడం అభినందనీయమని, ఆంధ్రప్రదేశ్ కు ఉన్న అనుకూలతలు పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం కల్పించే అవకాశాలను పారిశ్రామికవేత్తలకు తెలియజేయడంలో చంద్రబాబు లోకేష్ సఫలీకృతం అయ్యారని నాగ జగదీష్ అన్నారు. ఎవరు అధికారంలో ఉన్న విధానాలు ముందుకు తీసుకువెళ్లాలని కూడా ప్రధాని మోడీ కూడా కాంగ్రెస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విధానాలను ముందుకు తీసుకు వెళుతున్నారని, అలా తీసుకువెళ్లలేని దేశంలో ఒకే ఒక నాటి ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించడం వైసిపి నాయకులు సిగ్గుపడాలని నాగ జగదీష్ అన్నారు.//