తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి
జనం న్యూస్, అక్టోబర్ 30 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )
ప్రొఫెసర్ కోదండరాం ఆదేశాల మినగా బీసీలకు 42% రిజర్వేషన్ కోసం గళం ఎత్తుదామని తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి, మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టసభలో బిల్లు ప్రవేశపెట్టి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు,ఈ అంశంపై నవంబర్ ఒకటో తారీఖున తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం, హైదరాబాదు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సదస్సును నిర్వహిస్తున్నారు,అని ప్రొఫెసర్ కోదండరాం, పిలుపునిచ్చారు. బీసీ ఉద్యమం భాగంగా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేదందుకు తెలంగాణ జన సమితి పార్టీ మరో ఉద్యమానికి నాంది పలుకుతుంది తెలంగాణ కోసం ప్రొఫెసర్ కోదండరాం, ముందుండి తెలంగాణ ఉద్యమాన్ని ఏకతాటిగా ఎలా చేశారు అలాగే బీసీ ఉద్యమాన్ని నాంది పలుకుతుంది ఈ భాగంగా తెలంగాణ జన సమితి నాయకులు విద్యార్థులు బీసీలు అందరూ బీసీ సంఘాలు నాయకులు బీసీ 42 శాతం రిజర్వేషన్ సదస్సు కోసం అందరూ పాల్గొని విజయవంతం చేయగలరు నీరుడి స్వామి, ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.


